Mythology Info - Sri Uma Ramalingeswara swamy temple

Sri Uma Ramalingeswara Swamy Temple
Bhavani colony, Rajendranagar, RR Dist, Telangana, 500030.
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం
(Regd.No. 1141/2015)
www.srisaiurtemple.com
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం
Sri Uma Ramalingeswara swamy temple
Go to content
త్రిమూర్తులు ,Trimurtulu

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు.

* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.

* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.

* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.


ధ్వజ స్తంభం:

ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు.


కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి?

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.

కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా, గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తుంది.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం. ఇతరుల వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీకమాసంలో సువాసినులు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని “ఓం లక్ష్మైనమః..” ధ్యానించి పూజించాలి.


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే |
ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికినీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగును గాక" అని క్షమాపణ కోరుకోవాలి. ఆ ఆతర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి, పునః క్షమాపణలు చెప్పకుని, నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి.


Back to content